తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి - కలుషిత నీరు తాగి బాలిక మృతి

Severe illness of 11 members of the same family .. Girl dies
ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి

By

Published : Nov 9, 2020, 11:58 AM IST

Updated : Nov 9, 2020, 1:01 PM IST

11:55 November 09

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటుచేసుకుంది.  తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందగా... మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.  

గాంధారి మండలం మర్లకుంట తండాలో రవావత్ మేగ్యా, చిలికి బాయ్​లు కుటుంబ సభ్యులతో సహా నివాసముంటున్నారు. రోజులాగానే వ్యవసాయ బావి వద్ద త్రాగడానికి మంచినీటిని డబ్బాలో పట్టి ఉంచారు.  ఆ నీటిని శుక్రవారం, శనివారాల్లో కుటుంబ సభ్యులంతా తాగారు. ఆదివారం.. వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిదేళ్ల బాలిక శ్రీనిధి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లనే తమ ఆరోగ్యం క్షీణించిందని బాధితులు తెలిపారు.  

ఇవీచూడండి:ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్​.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు

Last Updated : Nov 9, 2020, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details