తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు... ఇద్దరి మృతదేహాలు లభ్యం - తెలంగాణ వార్తలు

ఏపీలో కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిండ ప్రదానం చేసేందుకు పెన్నా వద్దకు వచ్చి... నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

seven members-missing-in-Penna-river-at-Kadapa
పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు...

By

Published : Dec 17, 2020, 6:04 PM IST

Updated : Dec 17, 2020, 7:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నా నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు గుర్తించి వెలికి తీశారు. మరో ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో... గాలించడం కాస్త ఇబ్బందిగా ఉందని పోలీసులు తెలిపారు.

వీరంతా తిరుపతికి చెందిన వారని... పిండ ప్రదానం చేసేందుకు పెన్నాా నదికి వచ్చారని పోలీసులు వెల్లడించారు. మొత్తం 11 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి:పెళ్లి పనులు చేసేందుకొచ్చి... మృత్యు ఒడికి చేరారు

Last Updated : Dec 17, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details