శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ తన నివాసానికి సమీపంలో కారు నిలిపారు. అడ్డుగా ఉండడంతో స్థానికంగా ఉండే మహిళలు 'మా ఇంటికి వెళ్లేందుకు మీ కారు అడ్డుగా ఉంది... మీరు తీస్తే మేము మా ఇంటికి వెళ్తాం' అంటూ అభ్యర్థించారు.
కారు పార్కింగ్ వివాదం: మహిళలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి - శేరిలింగంపల్లి కార్పొరేటర్ వార్తలు
కారు పార్కింగ్ విషయంలో ఏర్పడిన వివాదం.. ఘర్షణకు దారి తీసింది. స్థానిక కార్పొరేటర్ తమపై దాడి చేశాడని... మహిళలు అని చూడకుండా అకారణంగా దూషించారని... పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటు చేసుకుంది.
కారు పార్కింగ్ వివాదం: మహిళలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి
ఈ క్రమంలో మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన నాగేందర్ సదరు మహిళపై దాడికి దిగారు. వీడియో చిత్రీకరిస్తుండగా దుర్భాషలాడారు. దీనిపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలు అని చూడకుండా అకారణంగా తమను దూషించిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:ప్రేమగా చూసే భర్తను చంపలేక తనువు చాలించింది
Last Updated : Sep 14, 2020, 8:25 AM IST