తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం - CASE

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  సూర్యతేజ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ పోలీసులకు తెలిపారు.  కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఝాన్సీ చరవాణిని విశ్లేషించిన పోలీసులు.. సూర్యతేజతో వాట్సాప్​ సందేశాలను పరిశీలిస్తున్నారు.

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు

By

Published : Feb 10, 2019, 5:03 AM IST

Updated : Feb 10, 2019, 1:14 PM IST

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసుఝాన్సీ ప్రియుడు సూర్యతేజ వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని... తల్లి అన్నపూర్ణ ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పంజాగుట్ట పోలీసులు... అన్నపూర్ణతో పాటు ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ వాంగ్మూలం సేకరించారు. పది నెలల క్రితం స్నేహితురాలి ద్వారా ఝాన్సీకి సూర్యతేజ పరిచయమయ్యాడు. అనతి కాలంలోనే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరువురి కుటుంబాలు ఒప్పుకుంటే ఉగాది పండగ దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో వీరికి గొడవలెందుకు జరిగాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ నివాసం ఉంటున్న ఇంటిని ఏసీపీ విజయ్ కుమార్, సీఐ మోహన్ కుమార్ మరోసారి పరిశీలించారు. సూర్యతేజను కూడా ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పంజాగట్టు పోలీసులు భావిస్తున్నారు. అతి త్వరలో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Last Updated : Feb 10, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details