సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయి దుర్మరణం చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కార్పెంటర్ ఆకాశ్... స్నేహితులతో కలిసి ఖండాల జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లాడు.
సరదాగా వెళ్లాడు.. సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలొదిలాడు! - Adolabad district latest news
ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతం వద్ద ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు.
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
జలపాతం వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. కాపాడేందుకు తోటి స్నేహితులు ప్రయత్నంచిన ఫలితం లేకుండా పొయింది. ఈ ఘటనలో ఆకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.