తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న గంజాయి, నిషేధిత గుట్కా పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు నిషేధిత పొగాకు, అంబర్‌ ప్యాకెట్లను కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. కిలో గంజాయితో పాటు 700 ప్యాకెట్ల అంబర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

అక్రమంగా తరలిస్తున్న గంజాయి, నిషేధిత గుట్కా పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న గంజాయి, నిషేధిత గుట్కా పట్టివేత

By

Published : Sep 21, 2020, 4:54 AM IST

కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు నిషేధిత పొగాకు, అంబర్‌ ప్యాకెట్లను కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. కిలో గంజాయితో పాటు 700 ప్యాకెట్ల అంబర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ.5.38 లక్షలు ఉంటుందని నిర్ధరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూరాబాద్‌ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.

మొలంగూరు అడ్డదారి వద్ద... కరీంనగర్‌ నుంచి హుజూరాబాద్‌ వైపుకు వస్తున్న కారు టీఎస్ 19 సీ 6456 వాహనాన్ని తనిఖీల్లో పట్టుబడినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మేడి రాము, కరీంనగర్‌కు జిల్లా కొత్తపల్లికి చెందిన గాసంగి ప్రవీణ్‌లు ఇద్దరు కలిసి కారులో గంజాయితో పాటు అంబర్‌ ప్యాకెట్లను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గుట్కా దందా అక్రమ వ్యాపారాన్ని నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'తెరాస ఎంత ఖర్చు పెట్టినా... ఈసారి గెలుపు కాంగ్రెస్‌దే'

ABOUT THE AUTHOR

...view details