తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లారీలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్​ బియ్యం పట్టివేత - కల్లెపల్లి వద్ద రేషన్​ బియ్యం పట్టివేత వార్తలు

లారీలో అక్రమంగా తరలిస్తోన్న సుమారు 3 వందల క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్​ చేసి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Seizure of ration rice being smuggled in a lorry
లారీలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Nov 1, 2020, 10:43 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 3 వందల క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బొమ్మల రామారం మండలం కల్లకుంట తండాకు చెందిన తేజావత్​ రవి లారీలో సుమారు 3 వందల క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా.. కల్లెపల్లి గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్​ చేసి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేషన్​ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా, అక్రమార్కులు వివిధ మార్గాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి.. చోరీని అడ్డుకోబోయిన యువకుడిపై కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details