వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంతో పాటు 22 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమ్రాన్ గత కొంత కాలంగా పేదల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నాడు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఆదివారం రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టణంలోని సర్దార్ పటేల్ కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనం, 22 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.