అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. తోయగూడెం నుంచి ఆసిఫాబాద్‌కు అక్రమంగా కలప తరలిస్తున్న ఆటోను అడదస్నాపూర్ వద్ద స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు.
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత - telangana news today
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలపను అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వాటి విలువ 30 వేలకు పైగా ఉంటుందని వెల్లడించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
![ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత Seizure of illegally transport timber in auto at asifabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10241337-910-10241337-1610627771620.jpg)
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
12 కలప దుంగలు లభించాయని వాటి విలువ 30 వేలకుపైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వావుదాంకు చెందిన మడావి సురేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కలప పట్టుకోవడంలో చాకచక్యం చూపిన ఫ్లయింగ్ స్క్వాడ్ సెక్షన్ అధికారి సాయి చరణ్, బీట్ అధికారి శ్రీనివాస్‌లను ఎఫ్ఆర్ఓ అభినందించారు.
ఇదీ చూడండి :పనిలో వేధింపులు.. సీనియర్‌ను చంపిన జూనియర్.!