రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత - 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి.. బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించారు.
![అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత Seizure of illegally stored ration rice at namapur in sirscilla district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9417923-691-9417923-1604405566739.jpg)
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
గ్రామానికి చెందిన కడమంచి గట్టయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితుడు గట్టయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి, బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
ఇదీ చూడండి.. 'కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను అధికారులు వేధిస్తున్నారు'