హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో ఆర్ఎఫ్ చాలియా స్టోర్‌పై చంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న 8 లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కాతో పాటు విదేశీ సిగరెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎఫ్ చాలియా స్టోర్ యజమాని మహమ్మద్ షుకూర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో నిషేధిత గుట్కాను నిల్వ ఉంచి పాన్ షాపులు, దుకాణదారులకు మహమ్మద్ షుకూర్ అమ్ముతున్నాడని సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిందితుడిపై చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టివేత - gutka
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని బండ్లగూడలోని ఓ స్టోర్‌పై దాడి చేసి 8 లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు.
భారీగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టివేత