తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేలుడు పదార్థాలు స్వాధీనం.. నిందితుడిపై కేసు నమోదు - పెద్దవార్వల్​లో పోలీసుల తనిఖీలు

మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దవార్వల్​ గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Seizure of explosives .. Case registered against the accused
పేలుడు పదార్థాలు స్వాధీనం.. నిందితుడిపై కేసు నమోదు

By

Published : Sep 13, 2020, 2:12 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పెద్దవార్వల్​ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో 77 కిలోల అమ్మోనియం నైట్రేట్‌, 74 డిటెక్టర్‌లతో పాటు 5 కిలోల యూరియాను కనుగొన్నారు.

కొండ ప్రాంతాల్లో ఉన్న రాళ్లను పేల్చేందుకు ఈ అమ్మోనియం నైట్రేట్​, డిటెక్టర్​లను నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి.. పక్కదారి పడుతున్న రేషన్​ బియ్యం.. పట్టుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details