తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అబ్కారీ శాఖ తనిఖీల్లో గంజాయి పట్టివేత - telangana news

అబ్కారీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Seizure of cannabis at Ambedkar Center in Bhadrachalam
అబ్కారీ శాఖ తనిఖీల్లో గంజాయి పట్టివేత

By

Published : Jan 17, 2021, 9:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో అబ్కారీ శాఖ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ గంజాయిని ఒరిస్సా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్​మెంట్​ ఖమ్మం సీఐ సర్వేశ్వర్ తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్స్ కరీం, హెడ్ కానిస్టేబుల్ సుధీర్, వెంకటేష్, హరీష్ పాల్గొన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:పండగకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details