తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిషేధిత గుట్కా పట్టివేత.. నిందితుడి అరెస్ట్​ - సంగారెడ్డి జిల్లాలో గుట్కా పట్టివేత వార్తలు

గుట్కా తరలిస్తోన్న ఓ వ్యక్తిని పటాన్​చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు రూ. లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Seizure of banned gutka .. Arrest of accused
నిషేధిత గుట్కా పట్టివేత.. నిందితుని అరెస్ట్​

By

Published : Aug 4, 2020, 9:30 AM IST

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిట్టిగుట్టకు చెందిన మహేశ్​గిరి.. పటాన్​చెరు మండలం ముత్తంగిలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి అక్రమంగా నిషేధిత గుట్కాను తీసుకొచ్చి.. స్థానికంగా విక్రయించేవాడు.

ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి కర్ణాటక నుంచి గుట్కాను అక్రమంగా కారులో తీసుకొస్తుండగా ముత్తంగి సమీపంలో పటాన్​చెరు పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కారును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీచూడండి: వాలంటీర్ ప్రేమాయణం... బంధువుల దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details