తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కంటైనర్‌ అడుగుభాగంలో 436 కిలోల గంజాయి - Sangareddy crime news

కంటైనర్‌ అడుగుభాగంలో తరలిస్తున్న 436 కిలోల గంజాయి పట్టివేత
కంటైనర్‌ అడుగుభాగంలో తరలిస్తున్న 436 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Dec 3, 2020, 5:01 PM IST

Updated : Dec 3, 2020, 8:02 PM IST

16:58 December 03

కంటైనర్‌ అడుగుభాగంలో 436 కిలోల గంజాయి

కంటైనర్‌ అడుగుభాగంలో 436 కిలోల గంజాయి

ఏపీ విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్న రూ. 44 లక్షలు విలువ చేసే ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా హాద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. న్యాల్కల్ మండలం శంషెల్లాపూర్ శివారు జహీరాబాద్-బీదర్ మార్గంలో స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ విశాఖ జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ముంబయికి పొక్లెయిన్ తరలించే ట్రాలీ లారీ అడుగుభాగంలో ప్రత్యేక పెట్టెలు అమర్చి 106  ప్యాకెట్లలో తరలిస్తున్న 436 కేజీల రెండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీ సహా గంజాయి ప్యాకెట్​లను జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.  

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న విశాఖపట్నం జిల్లా గొలుగొండ ప్రాంతానికి చెందిన కర్రే కృష్ణ, బొబ్బిలి వెంకయ్య నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్న హద్నూర్ సీఐ కృష్ణ కిషోర్, ఎస్ఐ విజయ్ రావులను డీఎస్పీ శంకర్ రాజు అభినందించారు.

ఇదీ చూడండి:ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

Last Updated : Dec 3, 2020, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details