కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలో ఇసుక నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారంటూ... 3 లారీలను పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. కాగజ్నగర్ మండలంలో రాస్పల్లి వాగు నుంచి ఇంద్రవెళ్లికి 3 లారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు. అయితే తాము రైతు వేదిక నిర్మాణం కోసం ఇసుక తరలిస్తున్నామని, దానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయని సదరు లారీ డ్రైవర్లు వివరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలు పట్టివేత
కుమురంభీం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలు పట్టివేత
ఈ విషయమై తహసీల్దార్ ప్రమోద్ కుమార్ను సంప్రదించగా.. జైనూర్, సిర్పూర్ (యు), మండలాల్లో రైతువేదిక నిర్మాణాలకు అవసరమైన 100 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఉన్న పత్రాలు చూసి విచారణ చేపడతామని, నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.