కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. కొంతకాలంగా లక్ష్మీపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - karimnagar district latest news
కరీంనగర్ జిల్లాలో అక్రమ రవాణా చేస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యంతో పాటు.. లారీ, నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు.
Seizure of 250 quintals of ration rice In Lakshmipur village, karimnagar district
లక్ష్మీపూర్‌లో రేషన్‌బియ్యం లారీలో అక్రమంగా నింపి తరలిస్తున్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంతోపాటు.. లారీ, నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు.