సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో పౌరసరఫరాల అధికారులు, పోలీసులు సంయుక్తంగా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పౌరసరఫరాల ఉప తహసీల్దార్ సురేశ్‌కు షాద్‌నగర్ నుంచి రేషన్ బియ్యాన్ని ఓ లారీలో తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - News of illegal ration rice confiscation
250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు, పోలీసులు సంయుక్తంగా సీజ్ చేశారు. షాద్‌నగర్ నుంచి మహారాష్ట్రలోని బలాస ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
250 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ఈ సోదాల్లో కేఏ 56 1130 అనే లారీలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే ఇవి షాద్‌నగర్ నుంచి మహారాష్ట్రలోని బలాస ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.