ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా ఒక వాహనంలో తరలిస్తున్న 25 క్వింటాల నల్లబెల్లాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై డానియల్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని వెలిశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.
25 క్వింటాల నల్లబెల్లం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల నల్లబెల్లాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారు ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు బెల్లాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అల్లాభక్షు, అతని అనుచరులు రాజశేఖర్, ఉత్తమ్‌దాస్ కలిసి ఏపీ 39టీకే 5660 నెంబర్ గల బొలెరో వాహనంలో 25 క్వింటాల నల్లబెల్లాన్ని ఏపీలోని చిత్తూరు నుంచి మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు తేలింది. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై రామకోటి , కానిస్టేబుళ్లు మధు ,సతీష్, ఆనంద్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు