ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇన్నోవా కారులో భద్రాచలం నుంచి జహీరాబాద్‌కు గంజాయి సరఫరా అవుతుందని తెలుసుకున్న కొనిజర్ల ఎస్సై మొగిలి.. తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్ - ఖమ్మం జిల్లా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని కొణిజెర్ల పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్టు
తనికెళ్ల సమీపంలో కారును తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి పొట్లాలు కనిపించగా... వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: సుమారు 2 వేల కిలోల నల్లబెల్లం సీజ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్