మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శివారులో ఇన్నోవాలో అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లాన్ని ఎక్సైజ్ కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కేజీల పట్టిక, పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం - మహబూబాబాద్ నేర వార్తలు
మహబూబాబాద్ జిల్లాలో భారీ ఎత్తున నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసముద్రం శివారులో ఎక్సైజ్ కార్యదళం సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల బెల్లం, 20 కేజీల పట్టిక, పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన నట్టే రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లాలో గుడుంబా, బెల్లం, గంజాయిల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.