ఓ సెక్యూరిటీ గార్డ్ అన్నంపెట్టిన సంస్థకు కన్నం వేశాడు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో మోనీదాస్ అనే వ్యక్తి నాలుగేళ్ల నుంచి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అసోంకు చెందిన మోనీదాస్ భార్యతో శంషీగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న మోనీదాస్... చాకచక్యంగా లాకర్ తాళం చెవిని మేనేజర్‌కు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకున్నాడు. దుకాణం మూసేశాక విధులు నిర్వహిస్తున్న మోనీదాస్ లాకర్ తాళాలు తెరిచి రూ.8లక్షల 95 వేలను కాజేశాడు. రాత్రికి రాత్రే శంషీగూడలోని ఇంటిని ఖాళీ చేసి పరారయ్యాడు.
కళామందిర్లో నగదు కాజేసిన సెక్యూరిటీ గార్డ్ - మేడ్చల్ లేటెస్ట్ న్యూస్
సంస్థకి రక్షణ కల్పించాల్సిన ఓ సెక్యూరిటీ గార్డ్ తాను పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. పక్కా ప్లాన్ రచించి చోరీ చేశాడు. రాత్రి వేళలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో లాకర్ తెరిచి నగదు కాజేశాడు. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు.
కళామందిర్లో నగదు కాజేసిన సెక్యూరిటీ గార్డ్
సోమవారం తెల్లవారుజామున లాకర్ తెరిచేందుకు వచ్చిన మేనేజర్... తాళంచెవి తమ వద్ద లేదని గ్రహించారు. మరొక తాళం చెవితో తెరిచి చూడగా అందులో ఉండాల్సిన నగదు మాయం అవడంతో చోరీ జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- ఇదీ చదవండి:హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం