సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామ శివారులోని తోషిబా పరిశ్రమలో గేటు మీద పడడంతో సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. జిల్లాలోని రాజంపేటకు చెందిన మహబూబ్ అలీ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన గేటును జరుపుతుండగా బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.
గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. జిల్లాలోని రాజంపేటకు చెందిన మహబూబ్ అలీ బుధవారం తెల్లవారుజామున గేటును జరుపుతుండగా ప్రమాదం జరిగింది.

గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతి
తీవ్ర గాయాల పాలైన అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.