తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కంటైనర్ ఢీకొట్టి సెక్యూరిటీ గార్డు మృతి - కంటైనర్ ఢీకొట్టి సెక్యూరిటీ గార్డు మృతి

ఓ ప్రైవేటు పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డును కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగులపల్లి పరిధిలో జరిగింది.

Security guard died with container collision at sangareddy district
కంటైనర్ ఢీకొట్టి సెక్యూరిటీ గార్డు మృతి

By

Published : Sep 19, 2020, 9:29 AM IST

సంగారెడ్డి జిల్లా నాగులపల్లి పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డును గురువారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతన్ని కంటైనర్ బలంగా ఢీకొట్టింది. అతను తీవ్రంగా గాయపడటం వల్ల స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మారెడ్డి మరణించాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ శంకరపల్లి మండలం కొండకల్ గ్రామ పరిధిలో నివసిస్తున్నాడు.



ఇదీ చూడండి :భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details