కుమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం కొండపల్లిలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నిర్మల పని చేయటానికి పత్తి చేనులోకి వెళ్లింది. ఆమెపై పులి దాడి చేయగా... అక్కడిక్కడే మరణించింది.
ఆ జిల్లాలో పులి దాడిలో మరొకరు మృతి.. భయాందోళనలో ప్రజలు - కుమురం భీం జిల్లా కొండపల్లిలో మహిళపై పులి దాడి
కుమురం భీం జిల్లాలో పులి వేటను ప్రారంభించింది. ఈ నెల 11న దహెగాం మండలంలో ఓ వక్తిని హతమార్చిన ఘటన మరువకముందే.. తాజాగా మరో మహిళా ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆ జిల్లాలో పులి దాడిలో రెండో వ్యక్తి మృతి
నిర్మల మృతదేహాన్ని అధికారులు కుటంబ సభ్యులకు అప్పగించారు. పులి దాడి ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 11న దహెగాం మండలం దిగడ ప్రాంతంలో.. విగ్నేష్ అనే యువకుడిపై పులి దాడి చేయటంతో ఆయన చనిపోయాడు.
ఇదీ చూడండి :కాగజ్నగర్ వంతెనపై కారు, ఆటో ఢీ... ఒకరు దుర్మరణం