తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమ, పెళ్లి అన్నాడు... అనుమానంతో హతమార్చాడు - Second marriage for both Husband who strangled and killed his wife at parchur in prakasam district

ఏపీలోని ప్రకాశం జిల్లాలో పర్చూరుకు చెందిన షేక్ మిరాభి అనే ముస్లిం మహిళను ఆమె భర్త కళ్లజోడు బాబు గొంతు కోసి హతమార్చాడు. ఇద్దరికీ ఇది రెండవ వివాహం కావడం విశేషం. వీరి మధ్య కలహాలు రావడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. మహిళ మొదటి భర్త మృతి చెందగా, నిందితుడికి ఇదివరకే భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రేమ, పెళ్లి అన్నాడు... అనుమానంతో హతమార్చాడు
ప్రేమ, పెళ్లి అన్నాడు... అనుమానంతో హతమార్చాడు

By

Published : Dec 26, 2020, 10:20 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా పర్చూరులో దారుణ హత్య కలకలం రేపింది. రెండో వివాహం చేసుకున్న వ్యక్తి... భార్యపై అనుమానంతో హత్య చేశాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

షేక్ మిరాభీ (30) అనే మహిళ భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు చీరాలకు చెందిన ఎలక్ట్రీషియన్​ బాబు (కళ్ళజోడు బాబు)తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇదివరకే వివాహమైన బాబు... మిరాభీని రెండో పెళ్లి చేసుకున్నాడు.

వివాహం అయిన తర్వాత మిరాభీ, బాబు మధ్య మనస్పర్థలు వచ్చాయి. భార్యపై అనుమానం పెంచుకున్న బాబు ఆమెతో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం కూడా గొడవ పెట్టుకున్నాడు. ఆమె నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న కత్తితో హతమార్చాడు.

కత్తితో బాబు కొట్టిన దెబ్బలకు కిందపడిపోయిన మిరాభీ... రక్తపు మడుగులో కొట్టుకుంటూ తనువు చాలించింది. ఆమె చనిపోయిందన్న సంగతి తెలుసుకున్న బాబు.. అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టపక్కల వాళ్లు విషయం తెలుసుకొని వెళ్లి చూసేసరికి ఇళ్లంతా రక్తం... రక్తపు మడుగులో మిరాభీ పడి ఉంది.

వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చీరాల డీఎస్పీ శ్రీకాంత్​, ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు బాబు కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:లింక్​ క్లిక్​ చేస్తే చాలు... ఓటీపీ చెప్పకుండానే ఖాతా ఖాళీ...!

ABOUT THE AUTHOR

...view details