కరీంనగర్ జిల్లా ఊటూరు ఎస్‌బీఐలో దుండగులు దోపిడీకి విఫలయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక బ్యాంకు వెనక భాగం తలుపులు పగులగొట్టి... ముగ్గురు దుండగులు లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
బ్యాంకు కొల్లగొట్టేందుకు విఫలయత్నం.. సీసీలో దృశ్యాలు - ఎస్‌బీఐలో చోరీకి యత్నం
బ్యాంకుకు వెనుకవైపు నుంచి ప్రవేశించిన దొంగలు.. లాకర్ తెరిచేందుకు నానా కష్టాలు పడ్డారు. చివరికి లాకర్ తెరుచుకోకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని ఊటూరు ఎస్‌బీఐలో చోటు చేసుకుంది.
బ్యాంకు కొల్లగొట్టేందుకు దొంగలు విఫలయత్నం.. సీసీలో దృశ్యాలు
వీరిలో ఒకరి చేతిలో మారణాయుధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు వ్యక్తులు బ్యాంకు బయట కాపలా ఉన్నట్లు తెలిపారు. లాకర్ పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నం చేసి... విఫలమయ్యారని వెల్లడించారు. దాదాపు 40నిముషాల పాటు బ్యాంకులో ఉన్న దుండగులు ముఖానికి మాస్కులు పెట్టుకొని దోపిడికి యత్నించారు. సంఘటనా స్థలానికి సీపీ కమలాసన్‌రెడ్డి చేరుకుని పరిశీలించారు.