సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాకు చెందిన గూగులోతు హన్మ అనే వ్యక్తి తన సహోదరునితో ఉన్న భూ తగాదా విషయన్ని పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్‌ను ఆశ్రయించారు. సర్పంచ్ ఇంటికి వెళ్లి సర్పంచ్ భర్తను పిలిచారు. నన్ను పేరు పెట్టి పిలుస్తావా అంటూ సర్పంచ్ లక్ష్మి భర్త వీరన్న హాన్మ పై కర్రతో దాడి చేశాడు.
సమస్య పరిష్కరించాలన్నందుకు చావబాదారు - సిద్దిపేట జిల్లా వార్తలు
భూమి విషయమై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ని సంప్రదించిన ఓ వ్యక్తి పై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సమస్య పరిష్కరించాలన్నందుకు చావబాదారు
బాధితుడు హన్మ కు తల, భుజం, కాళ్లకు గాయాలయ్యాయి. బాధితుడు హన్మ సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటనపై అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.