తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష - తెలంగాణ నేరవార్తలు

గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష ఖరారు
గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష ఖరారు

By

Published : Oct 28, 2020, 1:59 PM IST

Updated : Oct 28, 2020, 3:27 PM IST

13:56 October 28

గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్​కు వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. కేసుకు సంబంధించి 67 మంది సాక్ష్యులను విచారించినట్లు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తెలిపారు.  

    ఈ ఏడాది మే 20న వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్​లో స్థిరపడిన మక్​సూద్ అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. మక్​సూద్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఇద్దరు బిహారీ యువకులూ హత్యకు గురయ్యారు. కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితుడు సంజయ్​కుమార్​ను అరెస్ట్ చేశారు.  

    ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు చేసినట్లు పోలీసులు నిరూపించారు. ఘటన జరిగిన నెల రోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి పోలీసులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.  

"సంజయ్ కుమార్​ 9 మందిని హత్య చేశారనే నేరం నిరూపణ అయింది. ఆయనకు ఉరి శిక్ష విధించారు. పోలీసు వారు ఓరల్, డాక్యుమెంటరీ, సైంటిఫిక్, మెడికల్ ఎవిడెన్స్ పర్​ఫెక్ట్​గా కలెక్ట్ చేశారు. మా వాదనుల గట్టిగా వాధించాము. ఇక్కడిచ్చిన జడ్జిమెంట్... హైకోర్టుకెళ్లినా, సుప్రీంకోర్టుకెళ్లినా కన్ఫామ్​ అవుతుందని భావిస్తున్నాం. అక్కడ కూడా మా వాదనలు గట్టిగా వినిపిస్తాం. ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తాం. తొమ్మిది మందిని అతికిరాతకంగా హత్య చేశారని కోర్టు నిర్ధరించింది. ఒక అమ్మాయిని అత్యాచారం కూడా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి మరణ శిక్ష విధించింది." - న్యాయవాది

ఇవీచూడండి:గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు

Last Updated : Oct 28, 2020, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details