అమెరికాలోని చికాగో నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన మొయిజొద్దీన్(31) మృతి చెందాడు. 2015లో ఉన్నత చదువుల కోసం వెళ్లి మొయిజొద్దీన్ ఉద్యోగం సంపాదించాడు. 2019 సెప్టెంబర్లో హైదరాబాద్లో వివాహం చేసుకుని భార్యతో కలిసి అమెరికాలో జీవనం సాగిస్తున్నాడు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి - తెలంగాణ వార్తలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా మల్లికార్జునపల్లి వాసి మొయిజొద్దీన్గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

road accident
పని నిమిత్తం కారులో వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను పోషించే పెద్దకొడుకు మృతి చెందటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన ఖాజా మైనోద్దీన్ 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇతనికి మొయిజొద్దీన్, సిరాజోద్దీన్, రియాజొద్దీన్ ముగ్గురు కుమారులు ఉన్నారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
ఇదీ చదవండి:అన్న వచ్చాడని తీసుకెళ్లాడు... భార్యని కొట్టి చంపాడు!
Last Updated : Dec 20, 2020, 9:56 PM IST