కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామ శివారులోని మంజీర నదిలో గల ఇసుక క్వారీలో దళారులు జోరుగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి ఇసుకను తవ్వుతూ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఫలితంగా మంజీరా నది పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు భవిష్యత్తులో బీడు భూములుగా మారే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఇసుకను తవ్వాలని కోరుతున్నారు.
జోరుగా ఇసుక దందా.. అధికారులకు రైతుల ఫిర్యాదు - కామారెడ్డి జిల్లా నేర వార్తలు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామ శివారులోని మంజీర నదిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి ఇసుకను తవ్వుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
![జోరుగా ఇసుక దందా.. అధికారులకు రైతుల ఫిర్యాదు sand mafia.. Farmers complained to the authorities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8779709-45-8779709-1599922655091.jpg)
జోరుగా ఇసుక దందా.. అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
ఈ మేరకు పలువురు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంజీరా నదిలోని ఇసుక కార్వీని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీచూడండి.. ఖమ్మంలో హద్దు మీరుతున్న ఆకతాయిల ఆగడాలు