తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జడ్పీటీసీ దంపతులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేర వార్తలు

జడ్పీటీసీ సభ్యురాలు కామరెడ్డి శ్రీలత దంపతులపై దాడికి యత్నించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

sand mafia attack on zptc couple in badradri kothaguem district
జడ్పీటీసీ దంపతులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా

By

Published : Nov 11, 2020, 2:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తున్నారు. అంతే కాదు భౌతిక దాడికి దిగుతున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రభుత్వం అనుమతులతో ఇటీవల ఇసుక తవ్వుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వారికి అడ్డుకట్ట వేయాలని జడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత పలు ప్రయత్నాలు చేశారు.

మంగళవారం అర్ధరాత్రి జడ్పీటీసీ ఇంటికి వెళ్లి శ్రీలత, ఆమె భర్తపై దుండగులు దాడికి యత్నించారు. జడ్పీటీసీ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోంపల్లి, ఉప్పుసాక, సారపాక, బూర్గంపాడు కేంద్రాలుగా చేసుకుని అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని జడ్పీటీసీ ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్నా ఇసుక మాఫియాను ఏమి చేయలేరని ఈ ఘటన నిరూపించిందన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:దుబ్బాకలో ఓటమిపై తెరాస కార్యకర్త ఆత్మహత్య!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details