వరంగల్ నగరానికి ఇసుక తరలిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎనుమాముల వద్ద చేసిన తనిఖీలో ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. మిల్స్ కాలనీ సీఐ రవి కిరణ్.. వర్ధన్నపేట వద్ద మరో 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం - వరంగల్ నగరానికి అక్రమంగా ఇసుక రవాణా
వరంగల్ నగరంలో అక్రమ ఇసుక రవాణాలు పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ జిల్లా నుంచి నగరానికి ఇసుకని తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
![అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం sand illegal transportation to warangal city from warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9120222-670-9120222-1602309265331.jpg)
అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం
వర్ధన్నపేట ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపులు పెరగడమే గాక. గ్రామీణ జిల్లా నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తుండటంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.