చర్లపల్లి, చెంగిచెర్ల, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో వివిధ చమురు సంస్థలకు చెందిన గోదాముల్లో కొందరు అక్రమ దందాకు తెరలేపారు. అదును చూసి డీజిల్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు నల్లబజార్‌లో విక్రయిస్తున్నారు.
రూట్ మార్చిన అక్రమార్కులు.. డీజిల్‌కు బదులుగా ఏటీఎఫ్ - రాచకొండ పోలీసుల తాజా వార్తలు
చమురు అక్రమార్కులు రూట్ మార్చారు. డీజిల్‌కు బదులుగా ఏటీఎఫ్‌పై కన్నేశారు. దీనికి కొంచెం ఇంజిన్ ఆయిల్‌ను కలపగానే.. డీజిల్‌గా మాదిరిగా తయారవుతోంది. దీనిని... నల్ల బజార్లో విక్రయిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రాచకొండ పోలీసులు ఎప్పటికప్పుడు కొరడా ఝళిపిస్తుండటం వల్ల ఈ దందా కొంత వరకు అడ్డుకట్ట పడింది. దీంతో అక్రమార్కులు రూట్ మార్చారు. అనుమానం రాకుండా డీజిల్‌కు బదులుగా విమాన ఇంధనాన్ని ఎంచుకున్నారు. దీనికి ఇంజిన్ అయిల్‌ను కలపగానే అచ్చం డీజిల్ మాదిరిగా తయారవుతుంది. 200 నుంచి 300 లీటర్ల వరకు పోగవ్వగానే లారీలు, డీసీఎం తదితర భారీ వాహనాల డ్రైవర్లకు మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నారు.
మల్లాపూర్ డివిజన్ గోకుల్‌నగర్‌లో కొందరు వ్యక్తులు నకిలీ డీజిల్‌ను తయారు చేస్తున్నారంటూ రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఎస్వోటీ, నాచారం పోలీసులు రంగంలోకి దిగి పది రోజులు నిఘా పెట్టారు. దండు దయానంద్ అతని కుమారుడు దండు మహేష్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ ఇతర వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖాధికారులకు అప్పగించినట్లు వివరించారు.