తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు

rtc bus hit to two wheeler in siddipeta district
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..

By

Published : Dec 12, 2020, 9:32 AM IST

Updated : Dec 12, 2020, 12:00 PM IST

09:14 December 12

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాయంపేట రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాలిగామా శివారులో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి గాయాలు కాగా..  108 అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల డేవిడ్ (22), మంద ప్రసాద్ (18), వంగ ప్రసాద్ ముగ్గురు యువకులు గజ్వేల్​లో పెయింటింగ్ పనిచేసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జాలిగామా శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. 

విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, బంధువులు రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడికిి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఆందోళన కొనసాగించారు

ఇదీ చదవండి:నిమ్స్ ఆస్పత్రి వద్ద రెండు బస్సులు ఢీ

Last Updated : Dec 12, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details