వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ఫాతిమా బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హన్మకొండ నుంచి కాజీపేట్ వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జికి ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఇద్దరికి గాయాలు.. - ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఇద్దరికి గాయాలు..
ఓ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

rtc bus collide with auto at kajipet
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆటో, బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. ఆటో డ్రైవర్ కాజీపేట్ బాపూజినగర్కి చెందిన వ్యక్తి కాగా... వెనక కూర్చున్న ప్రయాణికుడిని నష్కల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చికిత్స కోసం క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు.