ఒకే సమయంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్, టాటా ఏస్ ఢీకొన్న ఘటన జగిత్యాల జిల్లా చల్‌గల్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తోన్న 8 మంది గాయపడ్డారు.
టిప్పర్, టాటాఏస్ను ఢీకొన్న బస్సు.. 8 మందికి గాయాలు - chalgal bus accident news
ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న టిప్పర్ని ఢీకొన్న బస్సు... అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టాటాఏస్ని కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
టిప్పర్, టాటాఏసీని ఢీకొన్న బస్సు... 8 మందికి గాయాలు
వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు... చల్‌గల్ వద్ద ముందువెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. అదుపుతప్పిన బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముందున్న టాటాఏస్ వాహనాన్ని కూడా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా... టాటా ఏస్ స్వల్పంగా పాడైంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్తే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.