సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం రహదారిపై సూపర్ లగ్జరీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
బస్సును ఢీకొట్టిన లారీ.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం - telangana crime news 2021
సూపర్ లగ్జరీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మామిళ్లగూడెం వద్ద సూపర్ లగ్జరీని ఢీకొట్టిన లారీ
ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మధిరకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గరయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో పది మంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్ పోలీసులు ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.