హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ప్రైవేట్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 బస్సులను సీజ్ చేశారు. మరో ఆరు బస్సులపై కేసు నమోదు చేశారు. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద కూడా అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆర్టీఏ అధికారుల తనిఖీలు... 3 ప్రైవేట్ బస్సులు సీజ్ - ప్రైవేట్ బస్సులు
ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసి... ఆరు బస్సులపై కేసులు నమోదు చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![ఆర్టీఏ అధికారుల తనిఖీలు... 3 ప్రైవేట్ బస్సులు సీజ్ rta-rides-on-private-travel-busses-in-lb-nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10209480-thumbnail-3x2-rtc.jpg)
3 ప్రైవేట్ బస్సులు జప్తు... ఆరు బస్సులపై కేసు