గ్రేటర్ హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ్టి వరకు జంట నగరాల్లో అనధికారికంగా తరలిస్తున్న రూ.కోటి 35 లక్షలను సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షల విలువైన గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు.
గ్రేటర్లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్ - Rs.one crore 35 lakhs rupees seized so far in Greater hyderabad
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలను సీజ్ చేసినట్లు రాష్ట్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది.
గ్రేటర్లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్
ఇక గ్రేటర్లో పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జంట నగరాల్లో తిరుగుతూ ఇప్పటి వరకు పలు పార్టీలకు చెందిన 15 వేల 914 ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
ఇవీ చూడండి: రెండోరోజూ సీఐ జగదీశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు