తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కంటైనర్‌ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ.. - rs.2 crore valued of cell phones theft

సినీఫక్కిలో కంటైనర్‌లో నుంచి రూ.2 కోట్ల విలువైన వస్తువులను దుండగులు కొట్టేశారు. ఈనెల 16న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఈ దొంగతనం జరిగింది. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అదును చూసి అపహరించారు. మొత్తం 2200 సెల్‌ఫోన్లు అపహరణకు గురైనట్లు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు.

కంటైనర్‌ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ..
కంటైనర్‌ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ..

By

Published : Sep 23, 2020, 11:50 AM IST

కంటైనర్‌లో నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు అపహరించిన ఘటన ఈనెల 16న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగింది. కంపెనీ ప్రతినిధులు మంగళవారం చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. ఈనెల 15న చెన్నై నుంచి దిల్లీకి రెడ్‌మీ కంపెనీకి చెందిన రూ.11 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను తీసుకుని కంటైనర్‌ బయలుదేరింది. కంటైనర్‌ డ్రైవర్‌ దేవేందర్‌ 16వ తేదీ రాత్రి 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆపాడు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అవకాశం కోసం కాచుకుని ఉండి ఇక్కడ అపహరించారు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు చోరీ అయిన విషయాన్ని గుర్తించని డ్రైవర్‌ అక్కడి నుంచి దిల్లీ బయలుదేరాడు.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ వద్దకు వెళ్లిన తర్వాత అనుమానం వచ్చిన డ్రైవర్‌ కంటైనర్‌ను ఆపి చూడగా తాళాలు తీసి ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ విషయాన్ని సెల్‌ఫోన్ల కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చాడు. వారు విషయాన్ని దిల్లీలో ఉన్న వారికి చెప్పగా హుటాహుటిన అక్కడ నుంచి వచ్చిన ప్రతినిధి కంటైనర్‌ను పరిశీలించారు. అందులో 2200 సెల్‌ఫోన్లు అపహరణకు గురయినట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2 కోట్లుగా నిర్ధారించి జీపీఎస్‌ ఆధారంగా కంటైనర్‌ మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆగినట్లు గుర్తించారు. ఇందుకు ఆరు రోజులు పట్టగా మాసాయిపేట వద్ద చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని మంగళవారం చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కంటైనర్‌ హరియాణాకు చెందినదని, డ్రైవర్‌ యూపీకి చెందినవాడని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు 2 బృందాలను నియమించామన్నారు.

ఇవీ చూడండి:చిత్తడవుతున్న రహదారులు.. ప్రమాదాలతో వాహనదారులు

For All Latest Updates

TAGGED:

live

ABOUT THE AUTHOR

...view details