శంషాబాద్ విమానాశ్రయంలో 70లక్షల విలువైన బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారం దొరికింది.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు పట్టివేత - తెలంగాణ నేర వార్తలు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సినిమా పక్కీలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకుని రూ.70లక్షలు విలువైన నాలుగు విదేశీ బంగారు బిస్కెట్టను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.70 లక్షల విలువైన బంగారం పట్టివేత
దుబాయ్ నుంచి వైజాగ్ వెళ్లిన అదే విమానంలో ప్రయాణించిన మరో ఇద్దరు ప్రయాణికులు ఈబంగారాన్ని దుబాయ్ నుంచి తెచ్చి ఉంటారని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని మరింత క్షుణ్ణంగా విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:మద్యం మత్తులో యువకుల హల్చల్.. 13 కార్ల అద్దాలు ధ్వంసం