ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో భారీ మోసం జరిగింది. కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 850 మంది నుంచి రూ.34 కోట్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసగాడు వసూలు చేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డాడు. ట్రేడింగ్ పేరుతో తనను మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని.... హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు మూడు నెలల క్రితం బేగంపేటకు చెందిన ఖయ్యూమ్ ఖాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ.34 కోట్ల వసూలు - ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం
ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో 850 మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా రూ.34 కోట్లు వసూలు చేశారు. కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డాడు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి... నిందితులను అరెస్ట్ చేశారు.
cyber crime
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు... మోసాలకు పాల్పడుతున్న సైనిక్పూర్కు చెందిన కౌశిక్ బెనర్జి, రేఖ జాదవ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరుపర్చారు.
ఇదీ చదవండి :మద్యం ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్