హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ బాహ్యవలయ రహదారి వద్ద... గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి వెయ్యి కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
ఔటర్రోడ్పై వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం... - rachakonda cp mahesh bhagwat latest news
పక్కాసమాచారంతో రాచకొండ పోలీసులు భారీ గంజాయి రాకెట్‌ను పట్టుకున్నారు. కంటైనర్‌లో తీసుకెళ్తున్న వెయ్యి కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.30 కోట్ల రూపాయలు ఉంటుందని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం... పరారీలో ఇద్దరు నిందితులు
గంజాయి విలువ సుమారు 1.30 కోట్ల రూపాయలు ఉంటుందని సీపీ వెల్లడించారు. నిందితులు హరియాణా, యూపీ వాసులుగా గుర్తించారు. వారణాసికి చెందిన వివేక్ సింగ్, మరో నిందితుడు మహదేవ్ పరారీలో ఉన్నారని... వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:పేకాట స్థావరంపై దాడులు.. ఏడుగురు అరెస్ట్