హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ రౌడీ షీటర్‌ను హత్య చేశారు.
రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే అయాజుద్దీన్ అలియాస్ కండ అయాజ్ అనే రౌడీ షీటర్‌పై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్త స్రావంతో అయాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.