హైదరాబాద్ నగర శివారు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్పల్లి చెరువు సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.
రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్ మృతదేహం.. - hyderabad crime news
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. జల్పల్లి చెరువు సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన రౌడీ షీటర్ సయ్యద్ వహేద్ అలీదని తెలిపారు.

రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్ మృతదేహం..
మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వహేద్ అలీగా పోలీసులు గుర్తించారు. హత్యగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వనస్థలిపురం ఇంఛార్జీ ఏసీపీ ఎం.శంకర్ ఘటనా స్థలిని పరిశీలించారు. రాళ్ల గుట్టల దగ్గరకు తీసుకొచ్చి హత్యచేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఇంఛార్జీ ఏసీపీ శంకర్ తెలిపారు.
రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్ మృతదేహం..