తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జక్రాన్​పల్లిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు లభ్యం - కుళ్లిపోయిన మృతదేహాలు పట్టివేత వార్తలు

నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లి అటవీప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

rotten deadbodies found at jakranpalli forest area
జక్రాన్​పల్లిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు లభ్యం

By

Published : Sep 22, 2020, 10:01 PM IST

నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లి అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తిగా కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు లభించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కుళ్లిపోయిన మృతదేహాల్లో ఒకటి మహిళదిగా, మరొకటి పురుషుడిదిగా గుర్తించారు. ఘటనాస్థలం వద్ద పురుగుల మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండిఃచైనా బెట్టింగ్​ కుంభకోణంలో దర్యాప్తు వేగవంతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details