మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తుపాకీతో గత కొద్దిరోజులుగా పలువురు వ్యాపారులను బెదిరించినట్లు సమాచారం. వీరికి మద్యం విక్రయాలు నిర్వహించే ఓ మహిళ సహకరించింది.
నాటు తుపాకీతో బెదిరింపులు.. అదుపులో నిందితులు - kesamudram
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు.. తుపాకీతో గత కొద్దిరోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
నాటు తుపాకీతో బెదిరింపులు.. అదుపులో నిందితులు
ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని వారివురితో పాటు మహిళను అదుపులోకి తీసుకొన్నారు. వీరికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత