కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పుల్లూరు సిద్ధరాములు ఇంట్లో నాటుబాంబు పేలగా ఇంటిపై కప్పు కూలింది. నిషేధిత నాటుబాంబు పదార్థాలు ఉంచడం వల్లే ఘటన చోటుచేసుకుంది.
జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు - కామారెడ్డిలో నాటుబాంబు పేలుడు
కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు కూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు
నాటుబాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిఃగత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?