ఏపీలోని కడప జిల్లా మైదుకూరు సాయినాథపురంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు, 70 వేల నగదు చోరీకి గురైనట్లు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహ వేడుకల కోసం కొనుగోలు చేసి దాచిపెట్టుకున్న బంగారు నగలు చోరీకి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
వేడికి మేడ మీద పడుకుంటే.. చల్లగా దోచేశారు! - కడపలో దొంగతనాలు వార్తలు
వివాహ వేడుకల కోసం ఇంట్లో నగలు దాచిపెట్టారు. వేసవి కారణంగా ఇంట్లో పడుకుంటే నిద్రపట్టడం లేదని మేడ మీదుకు వెళ్లి పడుకున్నారు. దుండగులకు ఇంతకన్నా మంచి దారి ఇంకేముంది? నేరుగా ప్రధాన ద్వారం గుండానే లోపలికి వెళ్లి చోరీకి పాల్పడిన ఘటన ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో జరిగింది.
వేడికి మేడ మీద పడుకుంటే.. చల్లగా దోచేశారు!
ఇంట్లో వాళ్లంతా మేడపై నిద్రిస్తున్న సమయంలో ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దుండగులు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కుక్కర్ మూతతో భర్తను హత్య చేసిన భార్య